ఆర్.ఆర్.ఆర్ కమిటై మంచి పనిచేశారు..!

ఏపి ఎలక్షన్స్ సమయంలో సినిమా వాళ్లు ఏ పార్టీకి సపోర్ట్ గా నిలవాలో తెలియక సతమతమవుతున్నారు. టిడిపికి సపోర్ట్ గా కొందరుంటే.. వైసిపికి సపోర్ట్ గా కొందరు నిలుస్తున్నారు. ఇక జనసేనకు మెగా అందడండలు ఉన్నాయి. ఈ టైంలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ మాములుగా అయితే ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. వారి మధ్య ఏమున్నా ఎలా ఉన్నా ఎన్.టి.ఆర్ మాత్రం టిడిపికి సపోర్ట్ గా ఉండేవాడు.

బాబాయ్ కోసం చరణ్ కూడా జనసేన తరపున ప్రచారం చేసేవాడు. కాని వీరిద్దరిని తీసుకెళ్లి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఇది యాదృచ్చికంగా జరిగినా ఏపి పొలిటికల్ మూమెంట్ లో ఎన్.టి.ఆర్, చరణ్ లు పాల్గొనకుండా భలే తప్పించుకున్నారు. ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నా వారి స్నేహం వీటన్నిటికి అతీతం కావాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం వడోదరాలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ జరుపుకుంటుంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2020 జూలై 31న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్ కూడా నటిస్తాడని తెలుస్తుంది.

Leave a comment