నాలుగు సినిమాలకే 12 కోట్ల రేంజ్ కు వెళ్లాడు..!

సిని పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే క్రేజ్ ఉంటుంది. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగినా సరే అది కొనసాగిస్తేనే తర్వాత ఆ క్రేజ్ కొనసాగుతుంది. ఇక ఈమధ్య హీరోలతో పాటుగా దర్శకులు తమ టాలెంట్ చూపించేస్తున్నారు. కొత్తవారే అయినా వారి స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ఆడియెన్స్ మెప్పు పొందుతున్నారు. వారిలో ఒకరు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి. పటాస్ నుండి ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఎఫ్-2 వరకు చేసిన నాలుగు సినిమాలు విజయం అందుకున్నాడు అనీల్ రావిపుడి.
1
ప్రస్తుతం తన తర్వాత సినిమా మహేష్ తో చేసే ఆలోచనలో ఉన్న అనీల్ రావిపుడి ఆ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ సుంకర తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ పారితోషికంగా 50 కోట్లు దాకా తీసుకుంటున్నాడట. ఒక్క సినిమాకే 50 కోట్లా అని ఆశ్చర్యపోవచ్చు. సినిమాకు రెమ్యునరేషన్ లా కాకుండా బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నాడట మహేష్.
2
ఇక ఈ సినిమా డైరక్టర్ అనీల్ రావిపుడికి కూడా 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. స్టార్ డైరక్టర్లకే ఈ రేంజ్ పారితోషికం ఇస్తారు. సో ఈ లెక్కన చూస్తే ఎఫ్-2తో అనీల్ కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క. జూన్ నుండి మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్తునని అంటున్నారు.
3

Leave a comment