ఆ రాత్రి కూడా వాళ్లు నన్ను వదలకుండా పని కానిచ్చారు – రష్మీ

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్లు ఎంత పాపులర్ అయ్యారనే విషయం పక్కనబెడితే.. ఆ షో ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఎవరు అంటే మాత్రం అందరూ ఠక్కున చెప్పే పేర్లు అనసూయ, రష్మీ. అవును.. తమ హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులకు పిచ్చెక్కించిన ఈ బ్యూటీ జబర్దస్త్ దెబ్బతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు.

ఇక వరుసబెట్టి సినిమాలు కూడా చేస్తూ తమ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. అయితే వీరి సక్సెస్ కంటే కూడా ఎక్కువ కాంట్రోవర్సీలకే ఇంపార్టెన్స్‌ ఇచ్చారు ఆడియెన్స్. ముఖ్యంగా రష్మీ గౌతమ్‌ హాట్ వీడియోలతో రెచ్చిపోయి మరీ తన అందాలను ఆరబోసింది. అయితే రెండు రోజుల క్రితం రష్మీ ఓ కారు యాక్సిడెంట్ చేసిందంటూ వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ యాక్సిడెంట్‌పై రష్మీ క్లారిటీ ఇచ్చింది. షూటింగ్‌ పూర్తి చేసుకుని డ్రైవర్‌తో పాటు తన కొత్త కారులో వస్తున్న రష్మీ.. యాక్సిడెంట్‌ అయినైప్పుడు తానే 108 వాహనానికి ఫోన్ చేసినట్లు ఆమె చెప్పింది.

అయితే ఆ సమయంలో అక్కడున్న ప్రజలు ఆమెను ఫోటోల కోసం వేధించారని.. కనీసం మానవత్వం కూడా చూపకుండా తమ పని తాము కానిచ్చారని రష్మీ ఫీల్ అవుతోంది. మనుష్యులు మరీ ఇంత నీచంగా బిహేవ్ చేస్తారా అని ఆమె భాదపడుతోంది. కారు యాక్సిడెంట్ జరిగిందనే బాధ ఓ వైపు.. మనుష్యుల బిహేవియర్ చూసి బాధ మరోవైపు కావడంతో రష్మీ అక్కడినుండి సైలెంట్‌గా వచ్చేసినట్లు వివరణ ఇచ్చింది.

Leave a comment