డేటింగ్ పై మెగాడాటర్ హాట్ కామెంట్..!

టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా హీరోలు వస్తున్న విషయం తెలిసిందే. ‘ఒకే మనసు’సినిమాతో మొదటి సారిగా మెగాబ్రదర్ కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ మార్చి 29న విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో నిహారికతో పాటు యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. తాజాగా ఓ వీడియోలో ’60 సెకండ్స్ విత్ నిహారిక’ కార్యక్రమంలో తనకు వచ్చిన పలు ప్రశ్నలకు ఆమె చిలిపి సమాధానాలు ఇచ్చారు. సూర్య కాంతం సినిమాలో నా క్యారెక్టర్ కాస్త కన్నింగ్ గా ఉంటుంది.

అన్ని విషయాల్లో స్వార్థంగా అలోచించే అమ్మాయి మనస్థత్వం. ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నాకు నచ్చవు. డేటింగ్ చేయాల్సి వస్తే…నా మాటను ఓపికగా వినే వ్యక్తిని ఎంచుకుంటా. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సమయంలో ఫసక్ అనే పదాన్ని వాడవచ్చు. అంటూ తన చిలిపి సమాధానాలు ఇచ్చింది.

Leave a comment