ఆర్.ఆర్.ఆర్ ఇద్దరు హీరోలు కాదు ముగ్గురు.?

అర్.ఆర్.ఆర్ సినిమా ఎనౌన్స్ మెంట్ తో అందరికి షాక్ ఇచ్చాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో వారిద్దరు రియల్ హీరోస్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడని తెలిసిందే. జక్కన్న అఫిషియల్ గా ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ విలన్ గా నటిస్తున్నాడా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు రాజమౌళి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.

నేను అతను విలన్ అని చెప్పలేదుగా అని అన్నాడు. అయితే తెలుస్తున్న సమాచరం ప్రకారం సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఓ ఫ్రీడం ఫైటర్ రోల్ లో కనిపిస్తున్నాడట. అతనెవరో కాదు విప్లవం వర్ధిల్లాలి అని నరనరాన దేశభక్తిని నింపుకుని, యుక్తవయసులోనే స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భగత్ సింగ్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపిస్తాడట.

ఆల్రెడీ కొమరం భీం గా ఎన్.టి.ఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ గా నటిస్తుండగా అజయ్ దేవగన్ కూడా భగత్ సింగ్ గా కనిపిస్తాడట. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ చివరి అర్ధగంట అజయ్ నటన అదిరిపోతుందని తెలుస్తుంది. కచ్చితంగా అజయ్ దేవగన్ పాత్ర చూసి అందరు షాక్ అవుతారట. ఇక ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.

Leave a comment