‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ రిలీజ్..!

టాలీవుడ్ లో ఇప్పటి వరకు వస్తున్న బయోపిక్ సినిమాల్లో ఎన్టీఆర్ బయోపిక్ కి ఎంతో ప్రాధాన్యత వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో తీశారు. ఈ సినిమా రెండు భాగాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడు కాస్త పరవాలేదు అనిపించినా..మహానాయకుడు మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మించారు.

ఈ సినిమా ఈ నెల 22 న రిలీజ్ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో సీఎం చంద్రబాబుని నెగిటీవ్ గా చూపిస్తున్నారని టాక్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆపే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన మరో సినిమా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నేడు రిలీజ్ చేశారు.

ఇందులో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఇంట్లోకి ప్రవేశించగానే దీపాలు ఆరిపోయినట్లు, గద్ద అక్కడే తచ్చాడినట్లు చూపించారు. దీనికి ‘తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం’ అనే క్యాప్షన్ ను జతచేశారు. ఈ మూవీలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి నటిస్తున్నారు. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Leave a comment