ఎన్టీఆర్ కే కాదు ప్రైజ్ మనీ కూడా పెంచేశారట..!

బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా దాదాపు ఎన్.టి.ఆర్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. మొదటి సీజన్ హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ కు ఓ క్రేజ్ వచ్చేలా చేసిన ఎన్.టి.ఆర్ సెకండ్ సీజన్ కు అందుబాటులో లేకపోవడంతో నానితో కానిచ్చేశారు. ఇక ఇప్పుడు 3వ సీజన్ కు మళ్లీ ఎన్.టి.ఆర్ ను హోస్ట్ గా తెస్తున్నారు. డిస్కషన్స్ అంతా ముగిశాయట ఇక అఫిషియల్ గా ఎనౌన్స్ చేయదమే లేటని అంటున్నారు. ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నందుకు ఎన్.టి.ఆర్ 20 కోట్లు దాకా తీసుకుంటున్నాడని తెలుస్తుండగా కంటెస్టంట్స్ కు భారీ ఆఫర్ ఇస్తున్నారట.

కేవలం వారి రెమ్యునరేషన్ మాత్రమే కాదు ఈసారి విన్నర్ గెలుచుకునే ప్రై మనీ కూడా దాదాపు కోటి రూపాయలని అంటున్నారు. మొదటి, రెండు సీజన్లలో 50 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ చేసింగ్ బిగ్ బాస్ ఈసారి 1 కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నారట. 50 లక్షలకే అంత డ్రామా నడిపించిన కంటెస్టంట్స్ ఈసారి కోటికి ఇంకెంత హంగామా చేస్తారో అన్న ఆలోచనలో ఉన్నారు ఆడియెన్స్. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా అయితే షో రసవత్తరంగా సాగుతుంది.

అంతేకాదు ఈసారి గేమ్ ప్లానింగ్ కూడా కొత్తగా ఉండబోతుందట. టాస్కులు కూడా కొత్తగా ట్రై చేస్తున్నారట. తప్పకుండా బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సీజన్ లో కంటెస్టంట్స్ ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి.

Leave a comment