బిగ్ బాస్ కోసం ఎన్.టి.ఆర్ అవస్థలు..?

రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 3వ సీజన్ కు రెడీ అవుతుంది. ఈ సీజన్ కు ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్.టి.ఆర్ మొదటి సీజన్ అదరగొట్టాడు. రెండవ సీజన్ నాని హోస్ట్ గా చేశాడు కౌశల్ ఆర్మీ వల్ల బిగ్ బాస్ రెండవ సీజన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు 3వ సీజన్ కు టైం వచ్చేసింది. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 సరికొత్త కాన్సెప్టులతో రాబోతుందట.

కచ్చితంగా ఈసారి మళ్లీ తారక్ తన హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేయబోతున్నారట. సినిమాలతో పాటుగా బుల్లితెరను షేక్ చేసేందుకు ఎన్.టి.ఆర్ రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి కంటెస్టంట్స్ విషయంలో కూడా ఎన్.టి.ఆర్ ఆంక్షలు పెట్టాడని తెలుస్తుంది. వివాదాలు సృష్టించేలా ఉన్న ఏ ఒక్కరిని హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వొద్దని చెబుతున్నాడట.

బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఎన్.టి.ఆర్ 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈసారి ప్రైజ్ మనీ కూడా కోటి రూపాయలుగా నిర్ణయించారట. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 3 అనుకున్న దాని కన్నా గ్రాండ్ గా ఉండబోతుందని మాత్రం చెప్పొచ్చు.

Leave a comment