అఖిల్ ” Mr. మజ్ను” ఆఫీషియల్ టీజర్..!

అక్కినేని వారసుడిగా అఖిల్ మొదటి రెండు సినిమాలు నిరాశపరచాయి. అందుకే కొద్దిపాటి టైంతో వెంకీ అట్లూరి డైరక్షన్ లో అఖిల్ చేస్తున్న 3వ సినిమా మిస్టర్ మజ్ ను. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా తీసి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

అఖిల్ ప్లే బోయ్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా అలాంటి వ్యక్తికి హీరోయిన్ పరిచయం తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అన్నది సినిమా కథ. టుడేస్ స్ట్రెస్ రిలీఫ్ కోసం హ్యూమన్ టచ్ కావాలంటూ రొమాన్స్ ఇరగదీస్తున్నాడు అఖిల్. చూస్తుంటే ఇది మిస్టర్ మజ్ఞు కన్నా మన్మధుడు 2 అంటే బాగుంటుందేమో. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్ మిస్టర్ మజ్ ను కోసం తెగ కష్టపడినట్టు తెలుస్తుంది. మరి వెంకీ అట్లూరి తొలిప్రేమ లానే ఈ మిస్టర్ మజ్ను సినిమాతో కూడా హిట్ కొడతాడా అక్కినేని హీరోగాకి మొదటి హిట్ అందిస్తాడా లేదా అన్నది చూడాలి.

Leave a comment