బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేసిన 2.0.. షాక్ లో సినివర్గం

రజిని, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.ఓ సినిమా బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టింది. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి బిగినింగ్ హిందిలో ఫుల్ రన్ లో 117 కోట్ల షేర్ రాబట్టింది. అయితే 2.ఓ మాత్రం 6 రోజుల్లోనే బాలీవుడ్ లో 120కోట్ల షేర్ రాబట్టి రజిని స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అక్ష్య కుమార్ కూడా ఈ సినిమాలో ఉండటం కలిసి వచ్చిన అంశమని చెప్పొచ్చు. అయితే బాహుబలి మొదటి పార్ట్ రికార్డులను బ్రేక్ చేసిన 2.ఓ పార్ట్ 2 అదేనండి బాహుబలి కన్ క్లూజన్ రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేదని అంటున్నారు. బాహుబలి-2 కేవలం హింది వర్షన్ లోనే 511 కోట్ల షేర్ రాబట్టింది.
1
ఆ రేంజ్ కలక్షన్స్ 2.ఓ రాబడుతుందా అంటే కష్టమే అని చెప్పొచ్చు. 2.ఓ 4 డేస్ లో 400 కోట్ల కలెక్ట్ చేసినట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇక ఇండియా మొత్తం మీద 2.ఓ 337 కోట్లు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 114 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. 5 రోజుల్లో 2.ఓ 451 కోట్లను కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. రోబో సినిమాకు పర్ఫెక్ట్ సీక్వల్ గా వచ్చిన ఈ 2.ఓ విజువల్ వండర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాను 2డి, 3డిలలో రిలీజ్ చేశారు. అయితే 2డి కన్నా 3డిలో ప్రేక్షకులు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. రజినితో పాటుగా సినిమాలో అక్షయ్ కుమార్ కూడా తన నట విశ్వరూపం చూపించారు.
2
బాహుబలిని బీట్ చేసే టార్గెట్ తోనే వచ్చిన 2.ఓ మొదటి పార్టుని అది కూడా హింది వర్షం రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఓవరాల్ గా బాహుబలి బిగినింగ్ రికార్డులు కొల్లగొట్టినా కన్ క్లూజన్ ను మాత్రం టచ్ చేసేంత సీన్ 2.ఓకి లేదని తేలిపోయింది. రాజమౌళి వర్సెస్ శంకర్ పోరులో శంకర్ ఓడిపోయాడని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు ట్రిపుల్ ఆర్ అంటూ టైటిల్ రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్ చిక్కుముడి ఇంకా వీడలేదు.

Leave a comment