ఎన్టీఆర్ ఆకారం పై మీడియా లో ఫ్యాన్స్ ఫైర్..

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ పిరియాడికల్ డ్రామాగా వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలోని ఎన్.టి.ఆర్ కు సంబందించిన పిక్స్ కొన్ని ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. మునుపటిలానే ఎన్.టి.ఆర్ లావుగా కనిపిస్తూ ఫుల్ గా గెడ్డం పెంచాడు. ఈ లుక్ ఆర్.ఆర్.ఆర్ లోనిదే అంటూ వార్తలు రాస్తున్నారు. పలు వెబ్ సైట్స్ ఈ న్యూస్ వైరల్ చేశాయి.
1
అయితే ఎన్.టి.ఆర్ ఫిట్ నెస్ ట్రైలర్ ఎల్లాయిడ్ స్టీవెన్స్ ఈ లీక్డ్ పిక్చర్స్ పై క్లారిటీ ఇచ్చారు. అవి ఇప్పటి ఫోటోలు కావని సంవత్సరం క్రితంవని క్లారిటీ ఇచ్చాడు స్టీవెన్స్. జై లవ కుశ తర్వాత అరవింద సమేత కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసిన ఎన్.టి.ఆర్ స్టీవెన్స్ సాయం తీసుకున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ కు సంబందించి కూడా ఎన్.టి.ఆర్, చరణ్ లకు స్టీవెన్స్ ఫిట్ నెస్ ట్రైలర్ గా ఉంటున్నాడు. లీకైన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్టీవెన్స్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా విషయానికొస్తే ఇద్దరు స్టార్స్ చేస్తున్న ఈ మల్టీస్టారర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న పర్ఫెక్ట్ మూవీగా ఈ ట్రిపుల్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అల్యుమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. చరణ్ అయ్యప్పమాల వేసుకోవడం వల్ల ఈ నెల 7న శబరి వెళ్తున్నాడు. అందుకే ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్ లు కనిపించే సీన్స్ మాత్రం సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. 2020 సమ్మర్ కల్లా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Leave a comment