పొలిటికల్ రి-ఎంట్రీ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణాలో ఎన్నికలు ముగిసాయి. టీఆర్ఎస్ జెండా అక్కడ రెపరెపలాడింది. కానీ జనాల్లో ఇంకా కూకట్ పల్లి నియోజకవర్గం కు సంబందించిన చర్చకు అయితే ఎక్కడా.. ఫుల్ స్టాప్ పడలేదు. ఎందుకంటే అక్కడ మహాకూటమి తరుపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసింది నందమూరి వారసురాలు సుహాసిని. అంతే కాదు ఆమె జూనియర్ ఎన్టీఆర్ కి సోదరి. అందుకే అందరి చూపు ఆ నియోజకవర్గం మీద ఎక్కువ ఫోకస్ అయ్యింది. ఈ ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమిపాలయ్యారు.

ఇక ఆ ఫలితాన్ని పక్కనపెడితే… తెలంగాణ ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీని రంగంలోకి దించడం వెనుక చంద్రబాబు పెద్ద వ్యూహమే రచించాడు. సుహాసిని ని రంగంలోకి దించడం ద్వారా… నందమూరి అభిమానుల మద్దతు తో పాటు ఇండ్రస్ట్రీలో టాప్ యంగ్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కకు.. పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తాడని… తద్వారా తెలంగాణ… ఏపీ ఎన్నికల్లో బాగా లబ్ది పొందవచ్చని చంద్రబాబు స్కెచ్ వేసాడు. ఎన్నికల్లో సుహాసిని గెలిస్తే … టీడీపీ కోటాలో ….ఓడితే జూనియర్ ఎన్టీఆర్ కోటాలో వేసేందుకు బాబు వ్యూహం పన్నాడు.

అయితే ఇటువంటి పరిణామాలను ముందుగానే పసిగట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్క కోసం ప్రచారం చేస్తారని అది తన భాద్యత అంటూ పచ్చ మీడియా పదేపదే ప్రకటనలు చేసినా సరే ఎన్టీఆర్ ఎక్కడా తొందర పడలేదు కేవలం అన్నదమ్ములు ఇద్దరూ శుభాకాంక్షలతో సరిపెట్టేశారు. ఈ ప్రచారంలో బాలయ్య ఒక్కరే బాధ్యత అంతా భుజాన వేసుకున్నారు. ఇక తెలంగాణాలో ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి గోరంగా ఓడిపోవడంతో రేపు ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి రావాల్సిందిగా ఎవరు ఎంతగా ఒత్తిడి చేసినా సరే తిరస్కరించాలని ఒక అభిప్రాయానికి తారక్ వచ్చేసినట్టుగా తెలుస్తోంది.

Leave a comment