చరిత్ర సృష్టించిన “వినయ విధేయ రామ ” శాటిలైట్ రైట్స్.. చెర్రీ కెరీర్‌ రికార్డ్..

మెగా పవర్ స్టార్ రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో క్రెజీ కాంబోగా వస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు చెర్రి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా దమ్ము ఏంటో ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే తెలుస్తుంది. ఏరియాల వారిగా ఈ సినిమా బిజినెస్ విషయంలో భారీ డీల్స్ జరుగుతున్నాయట.
2
ఇప్పటికే సినిమా డిజిటల్-శాటిలైట్ రైట్స్ 22 కోట్ల దాకా పలికిందని తెలుస్తుంది. మెగా అడ్డాగా మారిన నైజాం లో వి.వి.ఆర్ ను 24 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. గోదావరి జిల్లాల్లో చరణ్ సినిమా మరోసారి దుమ్ముదులిపే బిజినెస్ చేస్తుంది. పశ్చిమ గోదావరిలో 5.6 కోట్లకు డీల్ కుదిరిందట. గీతా సంస్థ అక్కడ ఈ సినిమా రిలీజ్ చేస్తుంది. గోదావరి జిల్లాల్లోనే 10 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. గుంటూరు 1.6 కోట్లు పెట్టి జయరాం అనే డిస్ట్రిబ్యూటర్ వినయ విధేయ రామ హక్కులు సొంతం చేసుకున్నాడట.
1
ఇంకా ఓవర్సీస్ తో పాటుగా మిగతా ఏరియాల బిజినెస్ డీల్స్ తెలియాల్సి ఉంది. కచ్చితంగా ఈ సినిమా చరణ్ కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేస్తుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో చరణ్ కు ప్రతినాయకుడిగా వివేక్ ఓబేరాయ్ నటిస్తున్నాడని తెలిసిందే. అంతేకాదు సినిమాలో తమిళ హీరో ప్రాశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి వారు కూడా నటిస్తున్నారు. మొత్తానికి చరణ్ రంగస్థలం తర్వాత బోయపాటి సినిమాతో మరోసారి రికార్డులపై కన్నేశాడని తెలుస్తుంది. జనవర్ 11న రిలీజ్ అవుతున్న విధేయ రామ రికార్డుల లెక్క ఏంటో తెలుస్తుంది.

Leave a comment