Moviesవిజయ్ దేవరకొండ " టాక్సీవాలా " రివ్యూ & రేటింగ్

విజయ్ దేవరకొండ ” టాక్సీవాలా ” రివ్యూ & రేటింగ్

సినిమా: టాక్సీవాలా
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంకా జావల్కర్, మాళవికా నాయర్ తదితరులు
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
నిర్మాత: బన్నీ వాస్, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
బ్యానర్: GA2 పిక్చర్స్, యువి క్రియేషన్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా వరుసగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. నోటా చిత్రంతో ఫ్లాప్ మూటగట్టుకున్న ఈ హీరో టాక్సీవాలా చిత్రంపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడటంతో ఈ సినిమా విజయంపై పలు అనుమానాలు రేకెత్తాయి. కానీ ప్రేక్షకులు తమవెంట ఉన్నారని ధీమాగా చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అనుకున్నట్లు విజయం అందుకున్నాడో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
శివ(విజయ్ దేవరకొండ) ఒక నిరుద్యోగి. డిగ్రీ ఉన్నా తనకు సరైన ఉద్యోగం రాకపోవడంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని సెకండ్ హ్యాండ్‌లో ఒక వింటేజ్ కారును కొంటాడు. ఇది తక్కువ ధరకు రావడంతో అతడు అత్యాశకు పోయి దాన్ని వెంటనే కొనేస్తాడు. అయితే ఈ కారులో ఏదో అతీత శక్తి ఉన్నట్లు అతడు గుర్తిస్తాడు. అది దెయ్యం అని తెలుసుకుని ఆ కారు అమ్మిన ఓనర్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు శివ. కట్ చేస్తే.. ఆ కారులో దెయ్యం ఒక వ్యక్తిని చంపుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు కారులో దెయ్యం ఎవరిది? అది మనుష్యులను ఎందుకు చంపాలనుకుంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కధ.

విశ్లేషణ:
వరుస విజయాలతో దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ చేసిన ఒక డిఫరెంట్ సినిమాగా టాక్సీవాలా నిలిచిపోతుంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తనదైన మార్క్‌తో తెరకెక్కించిన విధానం నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అయితే పూర్తిగా దెయ్యం కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా యూత్‌ను అలరించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పొచ్చు.

ఫస్టాఫ్ మొత్తం హీరో ఉద్యోగం లేక సతమతమవుతూ, ఏదైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూసి తక్కువ ధరకు వచ్చిందని ఒక వింటేజ్ కారును కొని ఎలా తిప్పలు పడతాడు అనేది చూపించారు. కారులో దెయ్యం ఉందని తెలుసుకున్న హీరో ఆ తరువాత దానితో స్నేహం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో హీరో మరియు అతడి స్నేహితులతో నడిచే కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. హీరోయిన్ ప్రియాంక జావల్కర్‌‌తో హీరో లవ్ ట్రాక్ అస్సలు బాగాలేదు. హీరోకు షాక్ ఇస్తూ ఒక కస్టమర్‌ను చంపుతుంది కారులోని దెయ్యిం. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ ట్విస్ట్ బాగుంది.

ఇక సెకండాఫ్‌లో అసలు కారులో ఉండే దెయ్యం గురించి తెలుసుకోవాలని హీరో అండ్ గ్యాంగ్ ప్రయత్నిస్తారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ విధానం ద్వారా మనిషి బ్రతికి ఉండగానే ఆత్మను బయటకు తీసుకురావచ్చని తెలుసుకున్న సిసిర(మాళవికా నాయర్) తన ప్రొఫెసర్ సహాయంతో ఈ ప్రయోగం చేస్తోంది. ఈ ప్రయోగం వల్లే ఆమె కారులో దెయ్యంగా మారిందని తెలుసుకుంటాడు శివ. అసలు సిసిర ఈ ప్రయోగం చేయడానికి ఎందుకు ఒప్పుకుంది అనే అంశం బాగా చూపించాడు దర్శకుడు. ఇక కారుతో సిసిరకు ఉన్న సంబంధం ఏమిటో తేల్చే పద్ధతిలో శివ ఊహించని నిజాలు బయటపడతాయి. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సిసిర ఆత్మను తిరిగి తన శరీరంలోకి పంపాలని చూస్తాడు శివ. ఈ క్రమంలో అతడు సక్సెస్ అయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా అనేది సినిమా కథ. ఓవరాల్‌గా చూస్తే ఇదొక సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను భయపెడుతూ నవ్విస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక సరికొత్త ప్రయోగం చేశాడు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
శివగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్. ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కాడు విజయ్. నేచురల్ యాక్టింగ్‌తో కామెడీని పండించడమే కాకుండా భయపడుతూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక క్లైమాక్స్ సీన్స్‌లో అతడు చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్‌ ప్రియాంకా జావల్కర్ ఈ సినిమాలో ఉందా అంటే ఉంది అనే టైపులో ఆమె పాత్ర ఉంటుంది. నటనకు ఏమాత్రం స్కోప్‌లేని పాత్రలో ఆమె నటించింది. మరో హీరోయిన్ మాళవికా నాయర్‌కు మాత్రం సినిమాలో మంచి పాత్ర దొరికింది. ఇక కామెడీ పండించడంలో హీరో ఫ్రెండ్స్ మధుసూదన్, మరియు చమ్మక్ చంద్ర అదరగొట్టారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర బాగా మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ ఎంచుకున్న కథ చాలా బాగుంది. ఇది మిగతా హార్రర్ థ్రిల్లర్‌లతో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటుంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు ఈ డైరెక్టర్. అయితే కథ బాగున్నప్పటికీ చూపించిన విధానం రొటీన్ సినిమాగా అనిపిస్తుంది. కొన్ని పాత్రలను ఊరికే అలా వాడేశాడు ఈ దర్శకుడు అని అనిపిస్తుంది. మొత్తానికి మొదటి చిత్రం అయినా ఈ దర్శకుడు ప్రేక్షకులను మెప్పించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అన్ని సీన్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చూపించారు. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ను నేచురల్ సీన్స్‌లా చూపించారు సుజిత్ సారంగ్. జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం అందించింది. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా..
‘టాక్సీవాలా’ మైలేజ్ బాగానే ఇచ్చింది!

రేటింగ్:
2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news