” అమర్ అక్బర్ ఆంటోని ” ఫస్ట్ డే కలెక్షన్స్.. కష్టాలలో కూరుకున్న మాస్ మహా రాజా..

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు. అయితే సినిమాలో పెద్ద మ్యాటర్ లేదని మరికొందరు అంటున్నారు. ఇలా మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కూడా మిక్సిడ్ కలెక్షన్స్‌ను రాబట్టింది.

ముఖ్యంగా రవితేజ గత సినిమాలతో పోల్చుకుంటే అమర్ అక్బర్ ఆంటోని చిత్రానికి ఓవర్సీస్‌లో పెద్ద హైప్ ఏమీ క్రియేట్ కాలేదు. కానీ ఈ సినిమా నేలటిక్కెట్ కలెక్షన్స్ రికార్డును దాటి వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అమర్ అక్బర్ ఆంటోని చిత్రం 86 లొకేషన్స్‌లో ప్రీమియర్ షోలకు గాను 57,848 డాలర్లు వసూలు చేసింది. అయితే నేలటిక్కెట్ చిత్రం మాత్రం కేవలం 32,280 డాలర్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇలా నేల టిక్కెట్ రికార్డును బద్దలు కొట్టిన అమర్ అక్బర్ ఆంటోని రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాలను మాత్రం టచ్ చేయలేకపోయింది.

ఇలా రవితేజ తన పాత సినిమాల రికార్డును బద్దలు కొట్టలేకపోవడంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో యావరేజ్‌గా ప్రారంభమైంది. అటు విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో ఈ చిత్ర కలెక్షన్లు మరింత పడిపోయే అవకాశం ఉంది. కానీ టాక్సీవాలా చిత్రం నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంటే కొంతలో కొంత అమర్ అక్బర్ ఆంటోని కలెక్షన్లు పెరుగుతాయి. మరి ఈ ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ రాజా ఎవరో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Leave a comment