వివాదాలతో సర్కార్ సంచలనం..!

మురుగదాస్ డైరక్షన్ లో కోలీవుడ్ హీరో విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా సర్కార్. ఈ సినిమా దీవాళి కానుకగా నవంబర్ 6న రిలీజైంది. అయితే సినిమా రిలీజైన నాటి నుండి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందు కథ కాపీ అంటూ హంగామా చేయగా రిలీజ్ తర్వాత ఒక పార్టీకి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని గొడవలు చేస్తున్నారు.
2
ముఖ్యంగా సర్కార్ సినిమా అన్నాడిఎంకే పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని ఆ పార్టీ మంత్రి కదంబు రాజు హడావిడి చేస్తున్నారు. అంతేకాదు దేవరాజు అనే వ్యక్తి ప్రభుత్వ విధానాలను సర్కార్ సినిమాలో తప్పుగా చూపించారని ఆ సీన్స్ కట్ చేయాలని గొడవ చేస్తున్నాడు. ఇక సినిమాలో యాంటీ రోల్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ కు కోమలవల్లి అని పేరు పెట్టారు. అది జయలలిత అసలు పేరని కావాలనే ఆమెకు ఆ పేరు పెట్టారని అంటున్నారు.
1
ఒక సీన్ లో మిక్సీలు, టివిలు తగలబెట్టడం. ముక్కుపుడకకు ఓటు అమ్మేద్దామా అనే డైలాగులు వివాదాలకు దారి తీశాయి. జయలలిత ప్రభుత్వంలో మిక్సీలు, టివిలు గిఫ్టులుగా ఇచ్చారు అవి తగలబెట్టడం సర్కార్ కచ్చితంగా అన్నాడిఎంకే పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమాగా చెప్పుకుంటున్నారు. అయితే వివాదాలతో సినిమా ఇంకాస్త పబ్లిసిటీ అవడంతో కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది సర్కార్. తెలుగులో కూడా 7 కోట్లకు బిజినెస్ అవగా రెండు రోజుల్లోనే నాలుగున్నర కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

Leave a comment