” వినయ విధేయ రామ ” ఆఫీషియల్ టీజర్..! భయపెట్టాలంటే 10 నిమిషాలు.. చంపాలంటే పావుగంట..

రంగస్థలం తర్వాత రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియరా అద్వాని నటిస్తుంది. దీవాళి కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను అలరించగా కొద్ది నిమిషాల క్రితం వచ్చిన ఈ సినిమా టీజర్ మెగా ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.
1
ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బోయపాటి చరణ్ తో అటు మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తీస్తున్న సినిమా వినయ విధేయ రామ. బోయపాటి సినిమాలో ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది. ఇక టీజర్ లో అన్నా వీడిని భయ పెట్టాలా.. చంపేయాలా అంటూ రాం చెప్పిన డైలాగ్ సూపర్.. ఇక చివర్లో రాం కొణిదెల అంటూ చెప్పే సీన్ అదిరిపోయింది.
2
సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో సెన్సేషనల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. టీజర్ లో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ తో పాటుగా విలన్ గా నటిస్తున్న వివేజ్ ఓబేరాయ్ కూడా కనిపించాడు.

Leave a comment