దేవరకొండకు మెగా అండ: వాపా.. బలుపా?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ శుక్రవారం టాక్సీవాలా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి సినిమాకు ముందు తానో సగటు హీరో అనిపించుకున్న దేవరకొండ విజయ్ ఆ సినిమా సక్సెస్ తో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. గీతా గోవిందం హిట్ అంతన్ని మరింత స్ట్రాంగ్ గా చేసింది. గోవిందం హిట్ తో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తన్ని స్టార్ అని పొగిడేశాడు.

ఇక మరోపక్క అల్లు అర్జున్ కూడా విజయ్ ను తన సోల్ బ్రదర్, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్ని గెస్ట్ గా వచ్చి సినిమాకు కావాల్సినంత పుషప్ ఇచ్చాడు. అయితే విజయ్ దేవరకొండపై మెగా హీరోలు చూపిస్తున్న ఈ ప్రేమపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుండి రాం చరణ్, బన్ని, అల్లు శిరీష్ కూడా ఏదో ఒక సందర్భంలో విజయ్ ను మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ తో గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు చేశాడు కాబట్టే విజయ్ మీద ఈ మెగా హీరోలు అభిమానం చూపిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు బయట సినిమాలు చేసినా విజయ్ కు ఇదే సపోర్ట్ వీరు అందిస్తారా అంటూ ప్రశ్నలేస్తున్నారు. విజయ్ తో గీతా గోవిందం హిట్ అందుకున్న అల్లు అరవింద్ అతని కెరియర్ బాగాలేనప్పుడు సినిమా ఇస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ విజయ్ చూపిస్తున్న ప్రేమ ఎలాంటిది అంటూ యాంట్రీ మెగా ఫ్యాన్స్ రచ్చ మొదలు పెట్టారు. అయితే విజయ్ అంత అమాయకుడేమి కాదని అతని కెరియర్ ఎలా వెళ్తుంది ఏంటి అన్నది అతనికి బాగా తెలుసు కాబట్టి ఎవరేం చేసినా విజయ్ తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లడం గ్యారెంటీ అని మాత్రం చెప్పొచ్చు.

Leave a comment