Gossipsసినీ చరిత్రలో ప్రబంజనంలా మారిన RRR..!

సినీ చరిత్రలో ప్రబంజనంలా మారిన RRR..!

సినిమా ప్రారంభం కాకుండానే భారీ అంచనాలు పెరిగిపోవడంతో పాటు …ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘RRR’ నిన్న(ఆదివారం) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యారు. వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే ‘RRR’కు ఎందరో సినీ ప్రముఖులు, అభిమానులు ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన మంచు మనోజ్ అయితే… దివంగత నందమూరి హరికృష్ణ ఫోటో తో … విషెస్ చెప్పి మరోసారి నందమూరి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ‘ఈ పిక్‌ని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ‘RRR’ సూపర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. మేము దీన్ని సినిమాగా పిలవలేము… దీనిని ‘RRR’ పండుగలా పిలుస్తాం.

దేవుడు ఈ టీమ్‌కి ఒక గొప్ప శక్తినివ్వాలి’ అని మనోజ్ ట్వీట్‌ చేసాడు. అలాగే … ఈ సినిమాకు అభినందనలు తెలియజేస్తూ… ప్రిన్స్ మహేష్ బాబు.. రానా దగ్గుపాటి.. ఇలా ఎంతోమంది తమ అభిమానాన్ని ట్విట్ల ద్వారా తెలియజేసారు. అన్నట్టు ఈ సినిమాకి దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా పై క్రేజ్ మాములు రేంజ్ లో లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news