2 .0 లో అసలు రజిని లేడా..?

2.0ను శంకర్ ప్రాణం పెట్టిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది. దాదాపు రూ.550కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. ప్రతీ ఫ్రేమ్‌లో భారీ తనం ఉట్టిపడేలా చూసుకున్నారు శంకర్. సాంకేతిక నేపథ్యంలో నిర్మితమై విడుదలై..విజయం సాధించిన హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను నిర్మించినట్లు సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత హాలీవుడ్ సినీ ప్రముఖులు ఇండియన్ సినిమా స్టాండర్స్ గురించి మాట్లాడుకుంటాయని పేర్కొంటున్నాయి.
రోబోకు ఇది కొనసాగింపు చిత్రంగా ఉండబోతున్న విషయం విదితమే. మొదటి చిత్రంలో అందాల భామతో రోబో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో చూపించాడు. అయితే 2.0లో ఏం చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా మేకింగ్ వీడియోలు, ట్రైలర్, ‘యంతర లోకపు సుందరివే’ త్రీడీ వీడియో సాంగును విడుదల చేశారు. అంటే ఇందులో హీరోయిన్ రోబోగా కనిపించబోతోందా..? కథానాయకుడు, కథానాయిక ఇద్దరు రోబోలుగా కనిపించబోతున్నారా..? అనే ఆసక్తి నెలకొంది.
అమీ జాక్సన్‌ని ‘యంతర లోకపు సుందరివే’ అంటూ వర్ణిస్తున్నారు రజనీకాంత్!
‘2.0’ చిత్రాన్ని ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఒక మంచి సందేశంతో దర్శకుడు శంకర్ ప్రతి సన్నివేశాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారని రజనీకాంత్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా విడుదల కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ రజనీ ప్రకటించడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్ గా కొనసాగనుందని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. సినిమా కోసం 3 వేల మంది వీఎఫ్ఎక్స్ నిపుణులు రేయింబవళ్లు కష్టపడి పని చేశారట. ఇందులో 2150 వీఎప్ఎక్స్ షాట్స్ ఉన్నాయట. 3డీ టెక్నాలజీతో.. 4డీ సౌండ్‌తో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా ఇది నిలవనుంది. రెహమాన్, రసూల్ పూకుట్టి కొత్త సౌండ్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నారట. నిర్మాత సుభాష్‌కరణ్ లేకపోతే సినిమా లేదని పలుమార్లు శంకర్ భావోద్వోగంతో పేర్కొన్న విషయం తెలిసిందే..ఇక 2 .0 లో అసలు రజినీకాంత్ కి బదులుగా సినిమాలో అధిక భాగం రోబో నే కనిపించనున్నారని తాజా సమాచారం. శంకర్ రెండవ భాగం లో కీలక సన్నివేశాలన్నీ రోబో తోనే చిత్రీకరించారని తెలుస్తుంది.

Leave a comment