చైతన్యను రోడ్డుమీద నిలబెట్టిన తమన్నా !

నాగార్జున వారసుడిగా నాగ చైతన్య లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

నాగార్జున అల్లరి అల్లుడు సినిమాలో నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాటని రీమిక్స్ చేస్తున్నారట. చైతు, తమన్నా హాట్ కపుల్స్ కాబట్టి ఈ పాట సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

హీరోయిన్ గా ఛాన్సులు రాకున్నా స్పెషల్ సాంగ్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకుంది తమన్నా. స్పెషల్ సాంగ్ కోసం 30 లక్షల దాకా పారితోషికం తీసుకుంటున్న మిల్కీ బ్యూటీ ఐటం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిందని చెప్పొచ్చు. మరి చైతు, తమన్నాల ఈ అల్లరి సాంగ్ ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

Leave a comment