చవితి రోజు విఘ్నేశ్వరుని స్మరించే 16 నామాలు…ఏమిటో తెలుసా?

ఏ పూజనైనా సరే వినాయకునికి పూజ చేసే మొదలుపెడతారు. గణేష్ నవరాత్రులతో భక్తులంతా పూజలతో బిజెగా ఉంటారు. లోకనాధుడైన గణనాధుడు పూజ చేస్తే సకల విఘ్నాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని చెబుతారు. గణపతి పూజ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మనిషి జీవితంలో పదహారు సంస్కారాలు ఉంటాయి. మనిషి జీవితంలో ధర్మ, అర్ధ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్య, దీర్ఘాయుర్దాయం, ఆరోగ్య్మ, సంపద, స్థిరత్వం, అభివృద్ధి, విజయం, వీర్యం, పుత్రపౌత్రాభివృద్ధి, కులదేవత అనుగ్రహం అనేవి పదహారు వరాలు.
3

22
ఈ పదహారు వరాలను తీర్చేలా పదహారు నామాలతో వినాయకుడిని స్తుతించాల్సి ఉంటుంది. వీటిని గుర్తుపట్టడం కష్టమైతే ఎవరైనా పిలిస్తే పలికినా మంచిదే.. విఘ్నేశ్వరుని పూజించాల్సిన పదహారు నామాల మంత్రం ఏంటంటే..
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే
1

2