గురువుగారు అంటూ తారక్ వెంట పడుతున్న హీరో!

టాలీవుడ్‌లో గురూజీ అని పేరు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్. ప్రస్తుతం త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా తారక్‌ను గురువుగారు అంటూ పిలుస్తూ ఒక హీరో వెంటపడుతున్నట్లు తెలుస్తోంది.
3
అసలు విషయం ఏమిటంటే.. అరవింద సమేతలో హీరో కమ్ కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్‌కు మంచి స్నేహితుడిగా సునీల్ నటిస్తున్నాడు. అయితే ఇందులో తారక్‌ను సునీల్ అస్తమానం ‘‘గురువుగారు’’ అని పిలుస్తాడట. సినిమాలో 90 శాతం కనిపించే సునీల్ మాటకు ముందొక గురువుగారు, మాటకు తరువాత ఒక గురువుగారు యాడ్ చేస్తాడని తెలుస్తోంది. ఇలా తారక్‌ను ఇంతలా మస్కా కొట్టే సునీల్ అలా ఎందుకు పిలుస్తున్నాడో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నాడు మన గురువుగారు.. అదేనండీ గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్.
2
సునీల్ తనకు మంచి మిత్రుడు కావడంతో త్రివిక్రమ్ అతడికోసం ఒక మంచి పాత్రను రాసినట్లు చిత్ర యూనిట్ అంటోంది. మరి ఈ సినిమాతో సునీల్ జనాలను నవ్వించడంలో మరోసారి తనను తాను నిరూపించుకుంటే ఇక సునీల్‌ ట్రాక్ ఎక్కినట్లే.
1

Leave a comment