మసాజ్ వీడియోస్ పై రంజిత అనూహ్య స్పందన..?

స్వామి నిత్యానంద చిప్పకూడు తినడానికి సిద్ధం అవ్వాల్సిన సమయం వచ్చేసింది. తన అనుంగు శిష్యురాలు, నటి రంజితతో కలిసి వీడియో టేపుల్లో సన్నిహితంగా ఉన్నది నిత్యానందేనని స్పష్టమైంది. ఈ మేరకు ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ బుధవారం (నవంబర్ 22) రిపోర్టు ఇచ్చింది. అవి ఒరిజనల్ టేపు లేనని నిర్ధారించారు. దీంతో ఈ స్వామివారి వాదనకు పసలేదని తేలిపోయింది.
33
ఆ వీడియో టేపుల్లో నటి రంజితతో కలిసి రాసలీలల్లో మునిగితేలింది తాను కాదని, తనను అప్రతిష్ట పాలు చేయడానికే కొంత మంది మార్ఫింగ్‌ చేసి, ఆ వీడియోలను బయటపెట్టారని నిత్యానంద ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చాడు. తనకు ఐహిక సుఖాలపై కోరికలు ఉండవంటూ నిత్యానంద ఈ అంశాన్ని తనదైన శైలిలో కొట్టిపారేశాడు.
22
కానీ అదంతా ఉత్తుత్తే అని తేలిపోయింది. 2010లో స్వామి నిత్యానంద రాసలీలల సీడీని ఆయన కారు డ్రైవర్‌ లీక్‌ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. తనను అప్రతిష్టపాలు చేసేందుకే కుట్రపన్నారని ఆయన ఆరోపణలు చేశాడు. ఈ అంశానికి సంబంధించి ఆయన కేసు ఎదుర్కొంటున్నారు.

Leave a comment