మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన సిఐ

CI misbehaves with a lady

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని కంప్లైంట్ ఇస్తే.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన సిఐ.. కాపాడాల్సిన రక్షక భటుడే ఇలా చేస్తే ఎలా..!

ఆడవారి మీద ఆఘాయిత్యాలు చేసే వారికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా సరే ఇంకా అలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఛాన్స్ దొరికితే చాలు మహిళా వేధింపులు ఎక్కడో ఓ చోట హడావిడి చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా తిరుపతిలో ఓ సిఐ మహిళను వేధిస్తున్న విధానం కాపాడాల్సిన రక్షక భటులే ఇలా తయారయితే ఎలా అని అంటున్నారు.

తిరుపతి సిఐ సిద్ధ తేజో మూర్తి తన దగ్గరకు ఓ కేసు విషయమై వచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడట. తన భర్త ఉద్యోగం కోసం ఫారిన్ వెళ్లి అక్కడ వేరే పెళ్లి చేసుకున్నాడని అతని మీద కేసు వేసేందుకు వచ్చింది. అయితే అది అదునుగా చేసుకున్న సిఐ ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడట.

తనతో ఉండాల్సిందిగా కోరుతూ అసభ్యకరమైన మెసేజ్ లు.. కాల్స్ చేశారట. మొత్తానికి పోలీస్ స్టేషన్ లో తనకి జరిగిన అన్యాయాన్ని మహిళా సంఘాల ముందు పెట్టగా వారు ఈ విషయాన్ని డిఐజీకి చేరేలా చేశారు. విషయం తెలుసుకున్న డిఐజీ వెంటనే సిఐ ను విధుల నుండి బహిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment