ప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్.. ఈ కాలం ప్రేమకథ ఇదే..!

లవ్ స్టోరీలతో ఎన్ని సినిమాలొచ్చినా ఏదో ఒక కొత్తదనంతో ప్రేమకథలే తీస్తుంటారు దర్శక నిర్మాతలు. సంవత్సరంలో రిలీజయ్యే సినిమాల్లో చాలా వరకు ప్రేమ కథలే ఉంటాయి. ఆ లవ్ స్టోరీల్లో నేటి యువతరం ఆలోచనలు అద్దం పట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు ఆడియెన్స్ కు నచ్చుతాయి.

ప్రస్తుతం అలాంటి కాన్సెప్ట్ తోనే వస్తున్న సినిమా ప్యార్ ప్రేమ కాదల్. సినిమా ట్రైలర్ చూస్తే ఇది పక్కా నేటి ట్రెండ్ ఫాలో అవుతున్న లవర్స్ కథ అని తెలుస్తుంది. హరీష్ కళ్యాణ్, రైజా హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అమ్మాయి సూపర్ స్పీడ్ గా ఉంటే.. అబ్బాయి మంచితనంతో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి ప్రేమ ఎలా ఉంది అన్నది సినిమా కథ.

మరి ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తుండగా సినిమాలో అసలు మ్యాటర్ ఏంటన్నది ప్రేక్షకుల ముందుకు వస్తేనే తెలుస్తుంది. ఎలాన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియెన్స్ ను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.

Leave a comment