సిగ్గని చెబుతూ.. హీరోయిన్ తో 19 సార్లు అలా చేశాడు..!

మెట్రో సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్ ప్రస్తుతం రాజా రంగుస్కి సినిమా చేస్తున్నాడు. శిరీష్ సరసన చాందిని ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటుగా రొమాంటిక్ సీన్స్ కూడా అలరిస్తాయట. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో, హీరోయిన్ ల మధ్య లిప్ లాక్ సీన్ గురించి చెప్పింది హీరోయిన్ చాందిని.
1
హీరో శిరీష్ చాలా సరదా మనిషని.. అతను అన్ని సీన్స్ సింగిల్ టేక్ లోనే చేశాడు కాని లిప్ లాక్ సీన్ మాత్రం 19 టేక్స్ చేశాడని అన్నది. 19 సార్లు చాందిని, శిరీష్ ల లిప్ లాక్ సీన్ షూట్ చేశాడట. తానైతే సింగిల్ టేక్ లో ఓకే చేసినా హీరో అంత కంఫర్ట్ ఫీల్ అవ్వలేదని అందుకే 19 సార్లు పట్టిందని అన్నది.

శిరీష్ కు సిగ్గు ఎక్కువ అందుకే లిప్ లాక్ సీన్స్ లో టేకులు ఎక్కువ తీసుకున్నాడని అంటుంది చాందిని. తెలుగులో ప్రస్తుతం చిన్న సినిమాలకు లిప్ లాక్ సీన్స్ మేనియా నడుస్తుంది. అదరచుంభనాలలో బాలీవుడ్ సినిమాలకు తెలుగు సినిమాలు పోటీ ఇస్తున్నాయని చెప్పొచ్చు.

Leave a comment