సినిమా కోసమైతే అలాంటి పని కూడా చేస్తా: నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు

Nithya menon sensational comments

మళయాళ పరిశ్రమ నుండి వచ్చి టాలీవుడ్ లో క్లిక్ అయిన భామల్లో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది నాటి నుండి గీతా గోవిందంలో గెస్ట్ రోల్ చేసినా అమ్మడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఈమధ్య బొత్తిగా సినిమాలు తగ్గించేసిన నిత్యా గురించి ఓ కామెంట్ వినపడుతుంది. సహజంగానే పొట్టిగా ఉండే నిత్యా మీనన్ ఈమధ్య లావు పెరగడం వల్ల తన అవకాశాలు మిస్ చేసుకుంటుందట.

నిత్యా వర్షన్ మాత్రం వేరేలా ఉంది. పొట్టిగా ఉండటం.. లావు పెరగడం ఇలాంటి కామెంట్స్ తాను అసలు పట్టించుకోనని. తన మీద తనకు చాలా కాన్ ఫిడెన్స్ ఉందని చెబుతుంది నిత్యా. తన జీవితంలో సినిమాలు కొంత పార్ట్ నిజంగానే సినిమా కోసం సన్నబడాలి అనిపిస్తే కచ్చితంగా సన్నబడి చూపిస్తా అంటుంది నిత్యా. సినిమా కోసమైతే చేస్తా కాని తన వరకు తాను ఎలా ఉన్నా బాగుంటానని చెబుతుంది అమ్మడు.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అడపాదడపా అవకాశాలను అందుకుంటున్న నిత్యా మీనన్ సోలో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం కాస్త లావు తగ్గాల్సిందే అని అంటున్నారు.

Leave a comment