షారుఖ్ పై ఫైర్ అవుతున్న నెటిజెన్లు..!

సినిమా హీరోలు పండుగ ఏదైనా తాము ముందుగా ఆ ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ క్రమంలో భాగంగా వినాయక చవితి సందర్భంగా షారుఖ్ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ చేశాడు. తన కొడుకు అబ్ రామ్ పిలవగానే గణపతి పప్పా ఇంటికి వచ్చేశాడు అంటూ పిక్ తీసి సోషల్ బ్లాగ్ లో పెట్టుకున్నాడు.

అదిచూసిన కొందరు నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. పరమత ఆరాధంత తప్పు కాదు కాని ఇలా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం ఏంటని కొందరు ముస్లీం సోదరులు ప్రశ్నిస్తున్నారు. ఇస్లాంలో విగ్రహారాధన నిశిద్ధమని తెలిసి షారుఖ్ ఇలా ఇంట్లో విగ్రహం పెట్టడం ఏంటని నెటిజెన్లు మండిపడుతున్నారు.

అయితే షారుఖ్ కు ఇలాంటివి కొత్తేమి కాదు కృష్ణాష్టమి టైంలో కూడా అతన్ని కొందరు నెటిజెన్లు కామెంట్స్ చేశారు. ఎవరేమన్నా షారుఖ్ మాత్రం తన మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాడు.

Leave a comment