ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Good news to ntr fans

బిగ్ బాస్ ఫైనల్స్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్.. నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

బిగ్ బాస్ హోస్ట్ గా నాని సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా అదరగొట్టగా.. సెకండ్ సీజన్ నాని తన మార్క్ తో దూసుకెళ్తున్నాడు. బిగ్ బాస్ 2 ఫైనల్స్ దగ్గర పడుతున్న ఈ టైంలో నాగార్జున ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చి విజేత ప్రకటిస్తాడని అన్నారు.

కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం మొదటి సీజన్ హోస్ట్ గా చేసిన ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ 2 ఫైనల్స్ కు వస్తున్నాడట. తండ్రి మరణ బాధ తనని వెంటాడుతున్నా కమిటైన సినిమాను.. తన మీద ఆశలు పెట్టుకున్న అభిమానులకు న్యాయం చేసేందుకు మాములుగా ఉంటున్నాడు ఎన్.టి.ఆర్. ప్రస్తుతం అరవింద సమేత ముగింపు షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ ఫైనల్స్ కు వచ్చి టైటిల్ విన్నర్ కు ప్రకటిస్తాడని తెలుస్తుంది.

Leave a comment