ఏయన్నార్ గా సుమంత్.. సూపరంతే..!

First look of sumanth as ANR in NTR

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఏయన్నార్ కు స్థానం ఉందని తెలిసిందే. ఏయన్నార్ గా అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటిస్తున్నాడు. అయితే ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ సినిమాలో ఏయన్నార్ లుక్ రివీల్ చేశారు. ఏయన్నార్ గా సుమంత్ పర్ఫెక్ట్ అనేలా కనిపిస్తున్నాడు.

నిజంగా ఏయన్నార్ లా కనిపిస్తున్న సుమంత్ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇదంతా మేకప్ మాయే అని తెలిసినా ఏయన్నార్ మళ్లీ నిజంగా వచ్చాడా అన్న ఆలోచన రాక మానదు. కొన్నాళ్లుగా కెరియర్ లో ఏమాత్రం సాటిస్ఫైగా నడిపించని సుమంత్ మళ్లీరావా సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్నాడు.

ఈ టైంలో సుమంత్ ఏయన్నార్ లుక్ ఎన్.టి.ఆర్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురానుంది. ఏయన్నార్ గా సుమంత్ లుక్ అద్భుతంగా ఉంది. అటు నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఏయన్నార్ లుక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు.

Leave a comment