విశ్వరూపం ఫస్ట్ డే కలక్షన్స్..!

కమల్ హాసన్ హీరోగా స్వీయ దర్శక నిర్మాణంలో వచ్చిన సినిమా విశ్వరూపం-2. 2013లో వచ్చిన విశ్వరూపం సినిమా సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. సినిమా డైరక్షన్ పరంగా చాలా పూర్ గా అనిపించిందని టాక్. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా అంతగా ప్రభావితం చూపించలేదట.

యూఎస్ లో 97 సెంటర్స్ లో రిలీజ్ అయిన విశ్వరూపం-2 మూవీ 38,604 డాలర్స్ వసూళు చేసింది. తెలుగు రాష్ట్రల్లో ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోగా ఈ సినిమా తమిళనాట పర్వాలేదన్న టాక్ తెచ్చుకుంది. కమల్ నటన, యాక్షన్స్ సీన్స్ మాత్రమే హైలెట్ గా నిలిచిన విశ్వరూపం-2 ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అంటున్నారు.

Leave a comment