4 కోట్లు ఇవ్వాలంటూ.. నాగ్ ఇంటి ముందు యువతి ధర్నా..!

సిని తారల మీద జనాల దృష్టి సర్వసాధారణం. హీరోలుగా కనిపించే వారి మీద అందరి ఫోకస్ ఉంటుంది. అవే వారిని ఇబ్బందికి గురయ్యేలా చేస్తాయి. తాజాగా నాగార్జున ఇంటి ముందు ఓ యువతి చేసిన హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ నుండి వచ్చిన విజయ అనే మహిళ తనకు నాగార్జున 4 కోట్లు ఇవ్వాలని తనని కలవాలని ఇంటి ముందు సెక్యురిటీతో గొడవ పడింది.

ఆమె మాట్లాడుతున్న మాటలని బట్టి ఆమె మతిస్థిమితం కోల్పోయిందని గుర్తించారు. భద్రతా సిబ్బంది నాగార్జున ఇంట్లో లేరని చెప్పినా వినకుండా ఆమె గొడవ చేయడంతో పోలీసులు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. అయితే ఇంతలోనే తన బంధువులు వచ్చి ఆమెకు మానసిక ఇబ్బందులతో బాధపడుతుందని చెప్పడంతో ఆమెని విడిచిపెట్టడం జరిగింది.

ఇదవరకు పూరి ఇంటి ముందు కూడా ఓ యువతి అవకాశం ఇవ్వాలంటూ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. సిని తారలపైనే ఇలాంటివి జరగడం ఆశ్చర్యకరం.

Leave a comment