బ్రేకింగ్ న్యూస్ : వైసిపీ కండువా కప్పుకోనున్న హరికృష్ణ..?

నందమూరి హరి కృష్ణ గత కొంత కాలంగా టీడీపీ అధిష్ఠానం పై మరియు చంద్ర బాబు పై గుర్రుగా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం హరి కృష్ణ కి పార్టీ లో తగిన ప్రాధాన్యం ఇవ్వక పోవటమే అని తెలుస్తుంది. గతంలో రాజ్యసభ కి నామినేట్ చేసిన ప్రత్యక్ష రాజకీయాలలో తనకి తగిన ప్రాధాన్యం ఎప్పుడు కల్పించలేదని తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారట హరి కృష్ణ. అంతే కాకుండా తన కన్నా తన తమ్ముడు బాల కృష్ణ కె ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని బాధ పడ్డారట.

అయితే ఈ పరిస్థితులతో బాగా కలత చెందిన హరి కృష్ణ వచ్చే ఎన్నికలకు వైసిపీ పార్టీ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని అయన సన్నిహితుల ద్వారా మీడియా కి ఒక వార్త లీక్ అయ్యింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు హరి కృష్ణ వైసిపీ లో చేరతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ కూడా తండ్రి బాట లోనే నడిచే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఎన్టీఆర్ కోరిన వ్యక్తులకి కాకుండా చంద్ర బాబు వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి ఎన్టీఆర్ ని అతని సన్నిహితువులని హర్ట్ చేసిన విషయం తెలిసిందే. హరి కృష్ణ ఈ వార్తల పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

Leave a comment