Gossips‘రంగస్థలం’ క్లైమాక్స్ కాపీ వివాదంపై క్లైమాక్స్ ..

‘రంగస్థలం’ క్లైమాక్స్ కాపీ వివాదంపై క్లైమాక్స్ ..

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ కాదు కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చరణ్ కెరియర్ లోనే కాదు టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించాడు చరణ్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నాళ్లకు గాంధి అనే రచయిత సినిమాలో తన క్లైమాక్స్ సీన్స్ కాపీ చేశారని రచయితల సంఘానికి లేఖ రాశాడు.

ఇక దీనిపై రైటర్స్ అసోషియేషన్ సుకుమార్ ను వివరణ కోరంగా తాను చిన్నప్పుడు చూసిన ధర్మ యుద్ధం స్పూర్తితో ఆ క్లైమాక్స్ అనుకున్నానని కాపీ ఏమాత్రం కాదని అన్నారు. గాంధి తను రాసుకున్న ఉక్కుపాదం, రివెంజ్ అనే కథల ముగింపు సన్నివేశాలు.. శత్రువుని చావు నుండి రక్షించి చంపేసే విధానం సుకుమార్ కాపీ కొట్టాడని అన్నారు.

ఇద్దరి వాదనలు విన్న రైటర్స్ అసోషియేషన్ సుకుమార్ చెప్పిన సమాధానం ఇచ్చిన లెటర్ కు కన్విన్స్ అయ్యారట. అయితే గాంధి ఈ విషయాన్ని ఇంకా కొనసాగించాలనుకుంటే మీ ఇష్టం అని అన్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news