Gossipsరా అండ్ రియల్.. మహేష్, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురు కలిసి..!

రా అండ్ రియల్.. మహేష్, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురు కలిసి..!

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల మధ్య సన్నిహిత్యం మరింత పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల కారణాలు ఎలా ఉన్నా స్టార్స్ మాత్రం ఫ్యాన్స్ కోసమే కాదు తమ కోసం కూడా ఒక్కటవుతున్నారు. మొన్నా మధ్య భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ అటెండ్ అవగా ఆ తర్వాత పార్టీలో మహేష్, ఎన్.టి.ఆర్ లకు చరణ్ కూడా యాడ్ అయ్యాడు.

ఇక ఇప్పుడు మళ్లీ ఆ ముగ్గురు ఓ పార్టీ చేసుకున్నారని తెలుస్తుంది. భరత్ సక్సెస్ లో మహేష్ ఈ పార్టీ ఇచ్చాడని అంటున్నారు. ఓ పక్క రంగస్థలం సక్సెస్ తో చరణ్, భరత్ అనే నేను సక్సెస్ తో మహేష్ ఇలా ఇద్దరు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమా కోసం స్లిం లుక్ లో దర్శనమిచ్చాడు.

ఈ ముగ్గురు పిక్ లీక్ చేసిన నమ్రత రా అండ్ రియల్ అంటూ కామెంట్ పెట్టారు. చూస్తుంటే ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచేందుకు ముగ్గురు కలిసి ఓ మల్టీస్టారర్ కూడా తీసినా తీస్తారని అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ లో మొదలైన ఈ స్టార్ ఫ్రెండ్షిప్ ఎన్నాళ్ల నుండో ఉన్నా అభిమానులను ఒకటి చేసేందుకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news