ర‌జ‌నీ – శంక‌ర్ షాకింగ్ న్యూస్…

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న 2.0 సినిమా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌జ‌నీ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు యేడాదిన్న‌ర కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాపై భార‌త‌దేశ సినీ ప్రేక్ష‌కుల్లోనే కాకుండా యావ‌త్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టించ‌డంతో బాలీవుడ్‌లోనూ లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పటికే పాటల్ని దుబాయ్ లో అట్టహాసంగా లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు రన్ టైమ్ తో మరింత స‌ర్‌ఫ్రైజ్ చేసింది. త్రీడీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ర‌న్ టైం 100 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ని టాక్‌.

అయితే ఈ న్యూస్‌పై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. తెలుగు, త‌మిళ్‌, హిందీ, మ‌ళ‌యాళ్‌, అర‌బిక్ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏఆర్‌.రెహ్మ‌న్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. 2010లో ర‌జ‌నీ – శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన రోబో సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

అజ్ఞాతవాసి 4 డేస్ కలెక్షన్స్… బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా

Leave a comment