ఎన్టీఆర్ రెమ్యునరేషన్.. రచ్చ మాములుగా లేదు..!

స్టార్ హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవ కుశతో తనకు మాత్రమే సాధ్యమయ్యే నట విశ్వరూపంతో ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. సిని ప్రేక్షకులను అలరించాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రం తో సినిమాకు సిద్ధమవుతున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాకు రెమ్యునరేషన్ గా భారీ మొత్తం ఆఫర్ పొందాడట. ఓ బడా నిర్మాత తారక్ తో సినిమా చేసేందుకు 26 కోట్ల పారితోషికం ఆఫర్ చేశాడట.

త్రివిక్రం సినిమా తర్వాత ఆ సినిమా చేయాలని చెప్పాడట. అయితే త్రివిక్రం తర్వాత రాజమౌళి సినిమా ఒప్పుకున్నాడు ఎన్.టి.ఆర్. అందులో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. సో మెగా నందమూరి మల్టీస్టారర్ తర్వాత తారక్ సోలో సినిమా ఉంటుంది. డైరక్టర్ ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాని నిర్మాత మాత్రం భారీ బడ్జెట్ తో ఆ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట.

2019 సమ్మర్ లో ఆ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి 26 కోట్ల రెమ్యునరేషన్ తో ఎన్.టి.ఆర్ రచ్చ మొదలు పెట్టడని చెప్పొచ్చు.

Leave a comment