పద్మావత్ వర్సెస్ భాగమతి.. గెలిచిందెవరు..?

అసలు ఏమాత్రం పోలిక లేని ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనూహ్యంగా మారింది. చరిత్ర కథతో వచ్చిన పద్మావత్, కల్పిత కథతో వచ్చిన భాగమతి. భారీ అంచనాలతో.. భారీ బడ్జెట్ తో వచ్చిన పద్మావత్ మొదలైన నాటి నుండి గొడవలతో.. అల్లర్లతో సాగింది. జనవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా చాలా చోట్ల సినిమాను రిలీజ్ కానివ్వలేదు.

ఇక సినిమా పరంగా బాగానే వసూళ్లను రాబట్టింది. 3 రోజుల్లో పద్మావత్ 80 కోట్ల కలక్షన్స్ సాధించింది. అయితే సౌత్ లో మాత్రం పద్మావత్ సినిమా కన్నా భాగమతి సూపర్ హిట్ అని అంటున్నారు. 26న రిలీజ్ అయిన భాగమతి సినిమా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. అనుష్క అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ భాగమతి సినిమా తొలిరోజు 10 కోట్లతో ప్రభంజనం సృష్టించింది.

ఓవరాల్ గా టాక్ పరంగా.. పద్మావత్ బాగున్నా భాగమతి సినిమాకు వసూళ్లు బాగున్నాయి. యువి క్రియేషన్స్ నిర్మించిన భాగమతి సినిమాను పిల్ల జమిందార్ అశోక్ డైరెక్ట్ చేశారు.

Leave a comment