త్రివిక్రం తో తారక్.. 26న ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి చేయబోయే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్నాళ్ల నుండో క్రేజీ కాంబినేషన్ గా అనుకున్న ఈ కలయికలో సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అజ్ఞాతవాసి ఫ్లాప్ తో డీలా పడ్డ త్రివిక్రం కు తగిన సపోర్ట్ ఇచ్చిన తారక్ ఈ నెల 26న ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేశారట.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబందించి టైటిల్ ను ఈ నెల 26న ఎనౌన్స్ చేయబోతున్నారని ఎక్స్ క్లూజివ్ టాక్. సినిమా టైటిల్ ను ముందే ఎనౌన్స్ చేసి అంచనాలు పెంచాలన్నది చిత్రయూనిట్ ప్లాన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడట.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా దసరా బరిలో దిగేలా ప్లాన్ చేస్తున్నారట. అజ్ఞాతవాసితో అపవాదాపు మూటకట్టుకున్న త్రివిక్రం తారక్ సినిమాతో అసలు సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడట.

Leave a comment