అదరకొడుతున్న ఎన్టీఆర్ 28 స్టార్ట్ అవ్వకుండా 29 పై అప్డేట్..

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్టు బొమ్మే అందరికి తెలుసు. ఎన్.టి.ఆర్ ఫాం ను కొనసాగిస్తూ వచ్చిన జనతా గ్యారేజ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అంతేకాదు తారక్ కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన సినిమాగా జనతా గ్యారేజ్ ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది.
ఆ సినిమా తర్వాత బాబి డైరక్షన్ లో జై లవ కుశతో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు తారక్. ప్రస్తుతం త్రివిక్రం తో సినిమా చేస్తున్న జూనియర్ అసలైతే కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. సినిమా ముహుర్తం కూడా పెట్టారు. కాని మధ్యలో రాం చరణ్ తో కొరటాల శివ సినిమా ఓకే చేసుకునే సరికి తారక్ సైడ్ అయ్యాడు. ఇప్పుడు చరణ్ కూడా శివను వదిలేసి బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు.
ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో సెట్ అవ్వాలంటే 2019 సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది. త్రివిక్రం సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ చేస్తున్న తారక్ ఆ సీమా పూర్తి చేశాక కాని కొరటాల శివ సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉంది. మరి జనతా గ్యారేజ్ కాంబో పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ మరో రెండేళ్ల దాకా వెయిట్ చేయక తప్పదు.

187 కోట్ల సినిమా అఖిల్ ఎందుకు కాదన్నాడు..!

Leave a comment