Gossips187 కోట్ల సినిమా అఖిల్ ఎందుకు కాదన్నాడు..!

187 కోట్ల సినిమా అఖిల్ ఎందుకు కాదన్నాడు..!

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు కిందా మీదా పడుతున్నాడు. మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ కాగా రెండవ సినిమాగా వచ్చిన హలో కూడా అంతంతమాత్రంగానే ఆడింది. కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో ఫెయిల్ అవుతున్న అఖిల్ బాలీవుడ్ లో ట్రెండ్ సృష్టించిన ఓ సినిమా రీమేక్ ఛాన్స్ వచ్చినా కాదనేశాడు. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా దాదాపు అక్కడ 187 కోట్ల దాకా కలక్షన్స్ వసూలు చేసింది.
ఇంతకీ అఖిల్ మిస్ అయిన ఆ సినిమా ఏది అంటే హే జవాని హై దీవాని. కరణ జోహార్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో అఖిల్ రెండవ సినిమాగా తెరకెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు నాగార్జున. రీమేక్ స్పెషలిస్ట్ వంశీ పైడిపల్లి ఆ సినిమా రీమేక్ చేయాల్సి ఉందట. కాని అఖిల్ మాత్రం ఆ సినిమాను వద్దనుకుని విక్రం చెప్పిన హలో కథను ఫిక్స్ చేసుకున్నాడు.
హలో సినిమా కూడా కథ ఓకే అనిపించినా ఇలాంటి రొటీన్ కథలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. మరి అఖిల్ ఎందుకు ఈ రాంగ్ డెశిషన్ తీసుకున్నాడో తెలియదు కాని ఓ సూపర్ హిట్ సినిమాను మాత్రం మిస్ చేసుకున్నాడని చెప్పొచ్చు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news