ఆ పెళ్ళయిపోయిన హీరోయిన్ అంటే ప్రభాస్ కి అంత ఇష్టమా ..?

ప్రభాస్ పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా. బాహుబలి అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ తాజాగా చేస్తున్న చిత్రం సాహో. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు పొందాడు కూడా . చాలా కాలం నుంచి ప్రభాస్ కి అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒకటే.. పెళ్లి.

ఈ ఆజానుబాహుడు పెళ్లిపై చాలానే పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఒక దశలో దేవయాని అదేనండి అనుష్కతో పీకల్లోతు ప్రేమలో కూడా ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అయితే అదంతా ఉత్తిదే అంటూ ప్రభాస్ కూడా ఖండించాడు. అయితే ఆయన మరో హీరోయిన్‌పై మనసు పారేసుకున్నారనే వార్త బయటకి వచ్చింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రవీనా టాండన్. అవును బాలీవుడ్ హీరోయిన్ రవీనా. అప్పట్లో తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. తను నటించిన ‘అండాజ్ అప్నా అప్నా’ మూవీలోని ‘ఎలోజీ సనమ్’ అనే సాంగ్ అంటే ప్రభాస్‌కు పిచ్చట. ఆ సాంగ్ చూసినప్పుడల్లా ప్రభాస్ ‘వావ్’ అంటూ ఆ సాంగ్‌ను అలానే చూస్తూ ఉండిపోయేవాడట.

ఇప్పటికీ ప్రభాస్‌కు రవీనానే ఫేవరేట్ హీరోయిన్ గా ఉందట. ఈ విషయాలన్నీ తాజాగా జరిగిన ఓఫంక్షన్ లో ప్రభాస్ షేర్ చేసుకున్నాడు. అన్నట్టు రవీనా భర్త అనిల్ థడానీయే బాహుబలి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు. అందుకే బాహుబలి2 సక్సెస్ తర్వాత వీళ్లంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు.

Leave a comment