ప్రభాస్, అనుష్కలను మించిపోయిన మిల్కీ బ్యూటీ !

మిల్కీ బ్యూటీ తమన్నాగురించి కొత్తగా చెప్పేది ఏముంది. చక్కటి అందాల బొమ్మలా .. అజంతా శిల్పంలా ఉంటుంది. ఇక తమన్నా డాన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎందుకంటే తమన్నాహీరోలను మించి డాన్స్ వెయ్యడంలో తన ప్రతిభ స్పెషల్ గా చూపిస్తుంది. తాజాగా ఈ అందాల రాసి ఓ సర్వేలో ప్రభాస్ , అనుష్కల ఫాలోయింగ్ కంటే ఈమెకే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు తేలిందట. మరిన్ని వివరాల్లోకి వెళ్తే…

సోషల్‌ మీడియాలో అత్యధిక పేజ్‌ వ్యూస్‌ కలిగిన హీరోల జాబితాను తయారు చేసింది ప్రముఖ ఆన్‌లైన్‌ డేటాబేస్‌ సంస్థ ఇంటర్‌నెట్‌ మూవీ డేటాబేస్‌(ఐఎండీబీ). నెలలో 250 మిలియన్ల పేజ్‌ వ్యూస్‌ ఉన్న ఇండియన్‌ స్టార్స్‌ను సెలెక్ట్ చేసుకుని దానిలో టాప్‌ 10 జాబితాను ఐఎండీబీ తాజాగా ప్రకటించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రభాస్‌, తమన్నా, అనుష్క ఈ జాబితాకు ఎంపికై రికార్డ్‌ సృష్టించారు.

అయితే ఈ జాబితాలో బాలీవుడ్‌ టాప్ హీరో షారుక్‌ఖాన్‌ మొదటిస్థానం పొందారు. ఆమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ప్రభాస్‌ ఆరో స్థానంలో, అనుష్క ఎనిమిదో స్థానంలో నిలవగా తమన్నామాత్రం నాలుగో స్థానాన్ని దక్కించుకుని అనుష్క , ప్రభాస్ లకు ఝలక్ ఇచ్చింది.
బాహుబలి లో నటించిన ముగ్గురు నటీనటులు టాప్-10 లో చోటు దక్కించుకుని దక్షిణాది సినిమా సత్తాను చాటారు. ఐదోస్థానంలో ఇర్ఫాన్ ఖాన్, ఏడో స్థానంలో అనుష్కశర్మ, తొమ్మిదోస్థానంలో హృతిక్ రోషన్‌, పదోస్థానంలో కత్రినా కైఫ్ నిలిచారు.

Leave a comment