స్వయం వారానికి 15 కోట్లు ఆఫర్ .. నో అన్న ప్రభాస్

యుంగ్ హీరో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ఇంకా బ్రమ్మచారి గానే ఉన్నాడు. అందుకే ప్రభాస్ తో స్వయం వరం ప్లాన్ చేసి అయనకు 15 కోట్లు ఇస్తానంటే అయన తిరస్కరించాడట. దీంతో ప్రభాస్ స్వయం వరానికి బ్రేక్ పడింది. ఇంతకీ విషయం ఏంటంటే..? రాజుల కాలంలో స్వయంవరాన్ని తలపించేలా ప్రభాస్‎పై ఓ అడ్వర్‎టైజ్ మెంట్ కాన్సెప్ట్‎ను సిద్ధం చేసిందట ఓ మేట్రిమోనియల్ సంస్థ.

పెద్ద దర్బార్ హాల్.. ఆ హాలులోకి యువరాజైన ప్రభాస్.. రాయల్ లుక్‎లో హుందాగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంపై కూర్చుంటాడు. చుట్టూ వందలాది సుందరాంగులు ప్రభాస్‎ను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. ఈ సీన్‎ను మోడర్న్ టైమ్స్‎కు కట్ చేసి పాత తరం స్వయంవరంలా మీకు నచ్చిన భర్తను సులువుగా ఎంపిక చేసుకోవాలంటే మా మేట్రిమోనియల్ వెబ్‎సైట్‎కు లాగిన్ అవ్వండి అనేది ఆ యాడ్ కాన్సెప్ట్ గా ప్లాన్ చేసారట.

ఈ యాడ్ నిమిత్తం 15 కోట్లు పారితోషకం కూడా ఇచ్చేందుకు సదరు సంస్థ సిద్దపడగా దానికి ప్రభాస్ నిరాకరించాడట. దీని వాళ్ళ తన వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతుందనే ఆలోచనతో ఆ ప్రతిపాదనను తిరస్కరించాడట. భారీ పారితోషకాన్ని కూడా వద్దనుకుని ప్రభాస్ తన వ్యాల్యూ బాగా పెంచుకున్నాడని అందరూ ప్రభాస్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
టాలీవుడ్‎లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‎లో కూడా ఒన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‎లర్ ప్రభాస్ అయితే ఆ మేట్రిమోనియల్ ప్రపోజల్‎కు ప్రభాస్‎నో చెప్పాడట. తన సింగిల్ స్టేటస్‎ను ఆ మేట్రిమోనియల్ సంస్థ క్యాష్ చేసుకోవాలనుకుంటోందని భావించి వ్యాల్యూస్, ఎతిక్స్‎కు ప్రాధాన్యమిచ్చి ఈ డెసిషన్ తీసుకున్నాడట యంగ్ రెబెల్ స్టార్. ఆ ఎండోర్స్‎మెంట్ గురించి ప్రభాస్ తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్ మీడియా కూడా తెగ పొగిడేస్తోందట. ప్రపోజ్ కాదన్నాడు ఓకే కానీ, బాహుబలి తర్వాత పెళ్ళి అన్న తమ హీరో పెళ్ళి పీటలెక్కేది ఎప్పుడో అని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ శుభ గడియలు ఎప్పుడో వేచి చూద్దాం…!

Leave a comment