ఎన్టీఆర్ ని మర్చిపోయారా..?ఆ సభల్లో ఇంత అవమానమా ..?

ఎల్‌బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా మేలు చేసిన ఎందరో మహానుభావులను గుర్తు చేస్తూ… వారి ఘన కీర్తీ అందరికి తెలిసేలా ఎందరో ప్రముఖుల చిత్రపటాలను, వారి పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు

ఇంతవరకు బాగానే ఉన్నా … తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరిట మాత్రం ఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేదు. కనీసం అయన పేరు కూడా ఎవరూ తలవలేదు. ఎక్కడా ఎన్టీఆర్ ఫోటోను కూడ పెట్టక పోవడంతో కనీసం ఎన్టీఆర్ కు ఈ కనీస గౌరవం కూడ ఇచ్చే స్థాయి కూడ లేదా ? అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణాలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్. కానీ రాజకీయాలను కాసేపు పక్కన పెడితే.. తెలుగు భాష అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఒకరకంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బతికి ఉందంటే దానికి ఎన్టీఆర్ అనేది ఎవరూ కాదనలేని నిజం. తెలుగు భాష ప్రతిష్ట ప్రకాశిపచేయడంలో ఆయన బాగా కష్టపడ్డారు. కేవలం ఎన్టీఆర్ ఒక్కరే కాదు తెలుగు సంస్కృతికి కళలకు సేవలు చేసిన ఎందరో ప్రముఖులను ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మర్చిపోయాయి.

ఈ సభలలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతిధిగా నాగార్జునను పిలిచినా నందమూరి కుటుంబాన్ని మరిచిపోవడం ఏమిటి అంటూ నందమూరి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. భాషా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం కృషి చేసిన మహనీయులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మహాసభలు జరిగే వేదికలు, ప్రవేశ ద్వారాలు, తోరణాలకు ఎన్‌టీఆర్‌ పేరు పెట్టకపోవడం తెలుగు జాతిని అవమానించడమే అంటూ ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment