“కుటుంబ కథా చిత్రం” రివ్యూ & రేటింగ్

టైటిల్‌:కుటుంబ కథా చిత్రం
నటీనటులు: నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వీఎస్ వాసు
నిర్మాత: డీ భాస్కర్ యాదవ్
సంగీతం: సునీల్ కశ్యప్
గత నెల రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారినికి సుమారు పది చిత్రాలు విడుదల కొంత సందడిని తెచ్చిపెడుతున్నది. ఈ క్రమంలోనే వచ్చిన సినిమా కుటుంబ కథా చిత్రం. కేవలం నాలుగు రాత్రుల్లో సినిమాను రూపొందించడం ఈ చిత్రానికి ఉన్న విశేషం. కాగా టాప్ యాంకర్, నటి శ్రీముఖి, హీరో నందులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓ కుటుంబానికి కాపలాగా ఉండే సెక్యూరిటీ రాక్షసుడిగా మారితే వారి జీవితం ఎలా ఉంటుందనే పాయింట్‌తో దాసరి భాస్కర్ యాదవ్ రూపొందించిన చిత్రానికి వీఎస్ వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :
చరణ్ (నందు), పల్లవి (శ్రీముఖి) భార్యభర్తలు. ఇద్దరు కూడా ఉద్యోగస్తులు. పల్లవి ఉద్యోగం చేయడం వల్ల అన్యోన్యత ఉండటం లేదు. ప్రేమానురాగాలు దూరమవుతున్నాయి. జీవితం యాంత్రికంగా మారింది అనే ఫీలింగ్‌లో ఉంటాడు చరణ్. ఎడబాటు తగ్గుతుందని పల్లవి ఉద్యోగం మాన్పించాలని అనుకొంటాడు. దాంతో వారి మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. ఈ క్రమంలో వారి జీవితాల్లోకి సెక్యూరిటీ ప్రవేశిస్తాడు..

న‌టీన‌టులు :

చరన్ పాత్రలో నందు కన్విన్స్‌గా నటించాడు. పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించడంలో సఫలమయ్యాడు. నందుకు చాలా కాలం తర్వాత నటించడానికి వీలున్న పాత్ర దొరికింది. తన పాత్రకు నందు పూర్తిగా న్యాయం చేశాడు. నటనలో లోపాలు వెతుకాల్సిన ఛాన్స్‌ను నందు ఇవ్వలేదని చెప్పవచ్చు.శ్రీముఖికి కూడా చాలా ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమె చేసిన పాత్రలన్నీ చిన్న చితక పాత్రలే. కుటుంబ కథా చిత్రంలో సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రతీ ఫ్రేమ్‌లో ఉండే పూర్తిస్థాయి క్యారెక్టర్‌ను శ్రీముఖి పోషించింది. పాత్ర స్వభావాన్ని అర్థం చేసికొని పల్లవికి రోల్‌కు న్యాయం చేసింది. శ్రీముఖికి కెరీర్‌కు ఈ సినిమా పెద్దగా ఉపయోగపడకపోయినా.. భారమైన పాత్రలను అవలీలగా పోషిస్తుందని చెప్పుకోవడానికి పల్లవి పాత్ర సహకరిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్‌:
– న‌టీన‌టుల ప‌నితీరు
– క‌థ‌నం
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
మైన‌స్ పాయింట్స్‌:
– స్లో నెరేష‌న్‌
– ఎడిటింగ్
– అతి ఎక్కువ
ఫైనల్ వర్డ్ :
చివరిగా “కుటుంబ కథా చిత్రం ” ఒక మంచి త్రిల్లింగ్ వున్న మూవీ.
రివ్యూ & రేటింగ్ : 2/5