“ఉందా.. లేదా..?” మూవీ రివ్యూ & రేటింగ్

ఈ వారం చిన్న సినిమాలకు పండగ. ఒకే రోజు 13 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో బాగా ఆసక్తి రేకెత్తించిన సినిమా ఉందా లేదా . ట్రైలర్ దగ్గర నుండే ఇదొక థ్రిల్లర్ అనే భావనతో ప్రేక్షకుడిని ప్రిపేర్ చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒక సారీ రివ్యూ చూద్దాం.

కథ:

రాజ్(రామకృష్ణ) డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా పనిచేస్తూ ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని తిరుగుతుంటాడు. దర్శకుడిగా సినిమా చేయాలనే ప్రయత్నాలు చేస్తూనే తన స్నేహితుడి యూట్యూబ్ కోసం డాక్యుమెంటరీలు చేస్తుంటాడు. అయితే విజయవాడలోని ఓ లేడీస్ హాస్టల్ లో బలవన్మరణాలు జరుగుతుంటాయి. దీన్ని డాక్యుమెంటరీగా చేయమని స్పెషల్ ఆఫీసర్(రామ్ జగన్) రాజ్ ను అడుగుతారు. రాజ్ ప్రేమించే అమ్మాయి కూడా అదే హాస్టల్లో ఉండడం తో డాక్యుమెంటరీ చేయడానికి రెడీ అవుతాడు. అసలు ఆ హాస్టల్ లో బలవన్మరణాలు ఎందుకు జరుగుతుంటాయి..? దీని వెనుక ఏవైనా ఉన్నారా..? అనేదే మిగతా కథ.

నటీనటులు:

ఈ సినిమాలో హీరో , హీరోయిన్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కాని , కొన్ని సన్నివేశాల్లో మాత్రం వారి నటన తేలిపోయింది అనే చెప్పాలి. అక్కడక్కడా షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అయితే హోం మినిస్టర్ పాత్ర చేసిన ఝాన్సీ ఈ సినిమా కు ముఖ్యమైన ప్లస్ పాయింట్. అలాగే మరో పాత్ర చేసిన రాం జగన్ కూడా ప్రేక్షకులని ఎంగేజ్ చెయ్యగలిగారు.

 

ఎలా ఉంది:

కొత్త రకమైన కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. తలుచుకుంటే , కొత్త ప్రేక్షకులని కూడా థియేటర్ కు రప్పించేలా చేసేంత సరకు ఉంది ఈ సినిమాలో. అయితే డైరెక్టర్ అనుకున్నదానికి , చెప్పినదానికి మధ్య వ్యత్యాసం బాగా కనిపిస్తుంది ఈ సినిమా విషయంలో. కథ , డైలాగుల విషయంలో కాసింత శ్రద్ధ వహించినా సినిమాని గెలుపు బాటలో నడిపించి ఉండొచ్చు. మొత్తం మీద నాలుగు అయిదు సన్నివేశాలు తప్ప సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయిందనే చెప్పాలి.
రివ్యూ & రేటింగ్ : 1.75/5