ఫేస్ బుక్ కుర్రడితో ప్రేమాయణం సాగిస్తున్న” హలో ” హీరోయిన్

‘హలో’ హీరోయిన్ అందాల సుందరి కల్యాణి ప్రియదర్శన్ మొదటి సినిమాతోనే కుర్రకారు మనసులను దోచేసుకుంది. తన అమాయకమైన ముఖంతో ముద్దు ముద్దు గా ఉన్న ఈ భామ ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించింది. దర్శకుడి కుమార్తెగానే ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టినా తన నటన మాత్రం అందరిని ఆకట్టుకుంది.

కల్యాణి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిజి ముద్దుల కూతురే. ఆత్మబంధువు, 20వ శతాబ్దం చిత్రంలో తన నటనతో లిజీ మెప్పించింది. పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా రూపొందించే నితిన్‌ చిత్రంతో లిజీ మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్‌ను ప్రారంభించనున్నారు. కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా మారకముందు సింగపూర్, అమెరికాలో చదువుకుంది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ చిత్రానికి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గానూ పనిచేసింది.

పెళ్లి గురించి ఏ హీరోయిన్ ని అడిగినా దాటవేస్తారు. కానీ కళ్యాణి మాత్రం అలా ఏమీ దాచుకోకుండా నిర్భయంగా తన మనసులో మాటను బయటకి చెప్పేస్తోంది. 2022లో తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడుతానంటోంది. చాలా రోజులుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా ఉంటున్న రితుల్ బ్రూస్ లీని పెళ్లాడుతానని దైర్యంగా చెబుతోంది. పెళ్లి చేసుకునే వరకు అతనితోనే ప్రేమలో ఉంటానని ధీమాగా చెప్తోంది.

Leave a comment