ఎన్టీఆర్- త్రివిక్రమ్ మూవీ ఆగిపోతుందా ?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమా కోసం టాలీవుడ్ సినీజ‌నాలు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబోలో సినిమా కోసం మ‌న తెలుగు సినిమా ప్రేక్ష‌కులు ద‌శాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్నారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమా టాలీవుడ్‌లో వ‌చ్చే యేడాది రిలీజ్ అయ్యే సినిమాల్లో భారీ అంచ‌నాలు ఉన్న సినిమాగా రికార్డుల్లో ఉంది.

ఇటీవ‌లే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్యఅతిథిగా ప్రారంభ‌మైన ఈ సినిమాను హారిక హాసిని బ్యాన‌ర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కు, ఎన్టీఆర్‌కు క‌థ విష‌యంలో కోల్డ్‌వార్ స్టార్ట్ అయిన‌ట్టు వ‌స్తోన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

వీరి మ‌ధ్య చిన్న‌పాటి ఇష్యూలో వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన‌ట్టు టాక్‌. ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ త‌న దైన స్టైల్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ స్టోరీని రెడీ చేశాడ‌ట‌. ఈ క‌థ ఎన్టీఆర్‌కు చెప్ప‌డం ఎన్టీఆర్ ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయి. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో మ‌రో సిన‌మా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు కూడా క‌థ అప్పుడే రెడీ అయిపోయిందట‌.

ఈ స్టోరీ లైన్ కూడా ఎన్టీఆర్‌కు త్రివిక్ర‌మ్ వినిపించాడ‌ట‌. అయితే ఆ క‌థ ఎన్టీఆర్‌కు త్రివిక్ర‌మ్ త‌న‌తో చేసే సినిమా కంటే పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌. దీంతో ఎన్టీఆర్ ఆ క‌థ‌తోనే త‌న‌తో చేసే సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్‌పై ప్రెజ‌ర్ చేశాడ‌ట‌. అయితే త్రివిక్ర‌మ్ ఇందుకు నో చెప్ప‌డంతో ఎన్టీఆర్ అల‌క‌బూన‌డం, ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గ్యాప్ రావ‌డం జ‌రిగిన‌ట్టు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న గుస‌గుస‌.

Leave a comment